ఈ మధ్య మనం విచిత్రమైన ఘటనల గురించి వింటూ ఉన్నాం. కొన్ని విషయాలు విన్నప్పుడు అసలు ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇంకొన్ని ఘటనలు జరిగినప్పుడు ఇది జరిగే ఛాన్సే లేదు అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన అలాంటిదే. ఒక వ్యక్తి తన అల్లుడు మీద పోలీస్ కేసు పెట్టాడు. కేసు ఏ విషయం మీద పెట్టాడో తెలిసి పోలీసులే కాదు అతను చెప్పిన రీజన్ విని అందరు షాక్ అయ్యారు. మరి ఆ మామ అల్లుడి మీద ఏమని కేసు పెట్టాడో తెలుసుకుందామా.

ప్రపంచంలో కనీవినీ ఎరుగని కేసు ఇది. తన కూతురు మరణానికి అల్లుడి పురుషాంగమే కారణమని ఓ మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని పురుషాంగం సాధారణ సైజు కంటే పెద్దగా ఉంటుందని, అందుకే తన కుమార్తె చనిపోయిందని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు బంధువుల ఎదుటే అల్లుడి దుస్తులు విప్పించి పురుషాంగాన్ని పరిశీలించారు. గ్రామస్థులకు కూడా దాన్ని చూపించారు. ఇండోనేషియాలోని మారోన్ కిదుల్ గ్రామానికి చెందిన నెది సిటో కుమార్తె జుమంత్రి (23) ఉదయం చూసేసరికి మంచంపై శవమై కనిపించింది. దీంతో నెది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అల్లుడు బర్సాహ్ పురుషాంగం పెద్దది కావడం వల్ల సెక్స్ చేస్తున్న సమయంలో ఆమె తట్టుకోలేక చనిపోయిందని ఆరోపించాడు. దీంతో పోలీసులు బర్సాహ్ పురుషాంగం చూపించాలని కోరారు. సాక్ష్యం కోసం నెది సిటోతోపాటు అతని బంధువులు, గ్రామస్థులకు కూడా దాన్ని చూపించారు. అయితే, అతడి పురుషాంగం అంత పెద్దది కాదని, సాధారణ సైజులోనే ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. మూర్ఛ రావడం వల్లే ఆమె చనిపోయిందని, ఇందులో అల్లుడు తప్పులేదని నెదికి తెలిపారు. దీంతో తప్పుగా అర్థం చేసుకున్నా అని నెది, అతని బంధువులు అల్లుడు బర్సాహ్‌కు క్షమాపణలు చెప్పారు. జముంత్రికి 14 ఏళ్ల వయస్సు నుంచే మూర్ఛవ్యాధి ఉందని, దానివల్లే ఆమె చనిపోయి ఉండవచ్చని నెది కూడా ఒప్పుకున్నాడు.. దీంతో పోలీసులు బర్సాహ్‌ను వదిలిపెట్టారు. చూశారుగా ఇలా కూడా ఎవరైనా ఆలోచిస్తారా.. సెక్స్ చెయ్యడం వలన చనిపోయిందంటే కొంచెం ఆశ్చర్యం వెయ్యక మానదు కదా. మరి ఈ మామ అల్లుళ్ళ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Category:

News

Comments are closed.